मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 94, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 87
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ,
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితు మర్హసి.
-- గీత. 2.27
అనునట్లు జననమరణములు కలుగుచుండును. వ్యాధులు మనోవ్యా-
ధులు అనుభవించెదను. ఇకముం దివి రాకుండుటకై నన్ను స్వీకరింపవల-
యును. గొప్పవారిని ఆశ్రయించు పక్షమున వారే పిలుచుకొని పోవలెను.
కాన నన్ను స్వీకరింపవలెను.
స్వామి : మీరేమి చేసెదరు?
నమ్మా : స్వామీ! నేను దాసభూతుడను. ఆస్తికుడను. నావం-
టివారిని చేర్చుకొనువాడ వగుటచేతనే ని న్నడుగుటకు
కారణ మగుచున్నది. నీవు లోకములయొక్క వ్యసనములను
పోగొట్టువాడవు.
స్వామి : శరీరము ధర్మసాధన మయినది కదా! ఇంకను కొన్ని
యేండ్లుండరాదా?
నమ్మా : స్వామీ! కొన్నిదినములీ లోకమున నుంటినేని నేను చెడిపో-
దును. దాసుడ నను భావమే సమసిపోవును. ఈ లోకమును
నాకు చూపవలదు. శీఘ్రముగ పిలిపించు కొమ్ము.
స్వామి : లోకు లే రీతి చెడియున్నారు. లోక మెట్లు చెడియున్నది?
నమ్మా : స్వామీ!
నైవ కించి త్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్,
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్ర న్నశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్.
ప్రలపన్ విసృజన్ గృహ్ల న్నున్మిష న్నిమిషన్నపి,
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్.
-- అని గీత. 5.8,9. శ్లోకములందు
చెప్పబడిన పదుమూడు కార్యములందును అనగా నిద్రలేచినది మొదలు
నిద్రించువరకు చేయుకార్యములందే మానవులు శ్రద్ధ గలిగియున్నారు.