मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 53, कुल 167 में से
संदर्भ में पढ़ें[Page 46]
ముకుందమాల
కుల : స్వామీ! అట్లు సదాధ్యానమును గలిగించుటకు కాదేని మరణ-
కాలమందైనను కలిగించిన చాలును..
స్వామి : మరణకాలమున దలచిన చాలునా?
కుల : 'అంతే నారాయణస్మృతిః' అని మీరే భాగవతములో వేద-
వ్యాసముఖమున పలికితిరి.
అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్,
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః.
-- గీత. 8.5
అని అంతిమస్మరణ చాలునంటిరి. ఇత్యాది కారణములచేత అంతిమ
స్మరణమే చాలునంటిని.
7
కృష్ణ త్వదీయ పదపంకజపంజరాంత
మద్యైవ మే విశతు మానసరాజహంసః,
ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తైః
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే.
కృష్ణ=ఓ కృష్ణమూర్తీ, మే=దాసునియొక్క, మానసరాజహంసః=మన-
స్సనెడి రాయంచ, త్వదీయ=దేవరవారి సంబంధమయిన, పదపంకజ=కమ-
లములవంటి పాదములనెడి, పంజర=పంజరముయొక్క, అంతం=లోప-
లిభాగమును, అద్యైవ=ఇప్పుడే, విశతు=ప్రవేశించుగాక, ప్రాణప్రయాణ-
సమయే=పంచప్రాణములు (దేహమును బాసి) పోవు వేళను, కఫ=శ్లేష్మము,
వాత=వాయువు, పిత్తైః=ఉష్ణము అను త్రిదోషములచేతను, కంఠ=కంఠము
యొక్క, అవరోధనవిధౌ=మూతపడుటయను కార్యము సంభవించినపుడు,
తే=దేవరవారియొక్క, స్మరణం=ధ్యానము, కుతః=ఎట్లు? (భవేత్=కలు-
గును.)