मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 52, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 45
కుల : స్వామీ! నేను మీపాదములను వర్ణింపబూనలేదు. 'అవధీ
రిత శారదారవిందౌ' అని నీ పాదములయొక్క కార్యమును
దెలిపితిని.
శారద=అనేక సంవత్సరములుగానుండు, అ=అధికమైన, రవిందం=
అంధకారమును, అవధీరిత=పోగొట్టును. అందుచేతనే నీ పాదచింతనము
నడిగితిని. నీయొక్క వ్రేలినఖమే కోటిసూర్యోదయప్రకాశమట్లుండును. ఇక
రెండుపాదములందలి పదినఖముల కాంతి చేరెనేని ఎట్టి యజ్ఞానాంధకార
మైనను పాయకుండునా?
స్వామి : అ ట్లేవరయిన నా పాదములను తమ హృదయాకాశమునం
దుంచుకొని అజ్ఞానాంధకారమును బోగొట్టుకొనిరా?
కుల : బ్రహ్మాదు లట్లు చేసియున్నారు. భాగవతమున నక్రూరుడు
శ్రీకృష్ణ దర్శనార్థముపోవుచుండి మార్గమధ్యమున రథము
దిగి "కంసా! . నీకు నమస్కారము. సనకాదులు నార
దాదులు ఏ భగవంతుని పాదనఖకాంతిచేత కోటిసూర్యులు,
నక్షత్రములు, అగ్ని ప్రకాశము వీనిచేత కాని, అజ్ఞానాంధ
కారమును పోగొట్టుకొనిరో, ఆ భగవంతుని పాదములను
సేవింపబోవుచున్నాను గదా యని ఆనందించెదను అనెను.
ఈ కారణములచేత నీ పాదస్మరణము నడిగితిని.
స్వామి : మూడవ శ్లోకమున 'అవిస్మృతిః'=మఱపులేని స్మృతిని అడిగి
తివి. నాల్గవ శ్లోకమున 'భావే భావే'=ప్రతిజన్మమునను అని
అడిగితివి. ఐదవ శ్లోకమున 'త్వత్పాదాంభోరుహయుగగతా
నిశ్చలా భక్తిరస్తు'=నీపాదములందు నిశ్చలభక్తి యుండ
వలయునని కోరితివి. నీ వడుగునట్లు సదాధ్యానమును
కలిగించుటకు సరిపడునా?