मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 43, कुल 167 में से
संदर्भ में पढ़ें36 ముకుందమాల
కుల : ‘భావే భావే హృదయభవనే భావయేయం భవన్తమ్.’ ప్రతిజన్మమునం
దును హృదయాకాశమున నిన్ను ధ్యానింపవలయును. అట్లు నిన్ను
ధ్యానించుటే సుఖము. ఈ దారపుత్రాదులతో గూడిన యింటి సుఖ
మును నేను కోరలేదు. ఈ యిల్లు శరీర ముండువరకు ఉండును.
అటుపిమ్మట పోవును.
మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః,
మనష్షష్ఠా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి.
-- గీత. 15.7
శరీరం య దవాప్నోతి యచ్చా ప్యుత్క్రామతీశ్వరః,
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్.
-- గీత. 15.8
పై శ్లోకము లట్లు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు ఆత్మతోడ పోవును.
కాపురముండు వాడు గోడకు కొట్టియుండిన చీలలను గూడ తీసికొనిపోవు
నట్లు ఆత్మ అంతవరకు నివసించుచుండిన శరీరమును విడిచి మఱియొక
శరీరమునకు పోవునపుడు ఇంద్రియాదులను గొంపోవును. అట్లగుటచేత
హృదయభవనము వెంట వచ్చునట్టిది. ఆ భవనమున సుఖపడుటకు
యోచింపవలయును. అశాశ్వతమైన యీ యింటిసుఖములు కోరదగునా?
నీవు వచ్చి హృదయము నలంకరించితివేని అందు కాపురము సల్పుచుండు
కామక్రోధాదులు లేచిపోవుదురు. అందుచేత ఒక్కొక్క జన్మమునందును
నీ ధ్యానము నిమ్మని మూడవ శ్లోకము ప్రకారము వేడుకొనుచున్నాను.
5
నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపమ్,
ఏతత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేఽపి
త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు.