मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 143, कुल 167 में से
संदर्भ में पढ़ें136 ముకుందమాల
జగత్త్రయగురుః = మూడులోకములను బాలించునట్టి, కృష్ణః = శ్రీ
కృష్ణుడు, నః = మనలను, రక్షతు = కాపాడునుగాక, అహం = నేను, కృష్ణం =
శ్రీకృష్ణమూర్తిని, నమస్యామి = నమస్కరించుచున్నాను. కృష్ణేన = శ్రీ కృష్ణు
నిచేత, అమరశత్రవః = దేవతా విరోధులైన రాక్షసులు, వినిహతాః = చంప
బడిరి, కృష్ణాయ తస్మై = ఆ శ్రీకృష్ణుని కొఱకు, నమః = నమస్కారము,
కృష్ణాదేవ = శ్రీకృష్ణుని వలననే, ఇదం జగత్ = ఈ లోకమంతయు, సము
త్థితం = పుట్టినది. అహం = నేను, కృష్ణస్య = శ్రీకృష్ణునికి, దాసః = సేవకుడను,
అస్మి = అగుచున్నాను. కృష్ణే = శ్రీకృష్ణునియందు, సర్వం ఏతత్ = ఈ ప్రపంచ
మంతయు, అఖిలం = నశింపకుండ, తిష్ఠతి = ఉన్నది; హే కృష్ణ = ఓ శ్రీకృష్ణా!,
మాం = నీ సొత్తయిన నన్ను, రక్షస్వ = కాపాడుము.
త్రిలోకములకును గురువగు శ్రీకృష్ణుడు మమ్ము రక్షించుగాక! నేను
కృష్ణుని సేవించెదను. కృష్ణుని చేత అమరశత్రులు-అసురులు చంపబడిరి.
కృష్ణుని కొఱకు నమస్కారము. ఈ జగత్తు కృష్ణుని వలన పుట్టినది. నేను
శ్రీకృష్ణునకు దాసుడను. ఈ సమస్తమును శ్రీకృష్ణుని యందు నెలకొనియు
న్నది. ఓ కృష్ణా! రక్షింపుము.
కులశేఖరులు ఎనిమిది విభక్తులను ప్రయోగించి శ్రీకృష్ణమూర్తిని స్తుతిం
చినారు.
కృష్ణుడు రక్షించుగాక -- ప్రథమావిభక్తి
కృష్ణుని సేవించెదను -- ద్వితీయావిభక్తి
కృష్ణుని చేత అసురులు సంహరింపబడిరి -- తృతీయావిభక్తి
కృష్ణుని కొఱకు నమస్కారము -- చతుర్థీవిభక్తి
కృష్ణుని వలన ఈ జగమంతయు పుట్టినది -- పంచమీవిభక్తి
కృష్ణునకు నేను దాసుడను -- షష్ఠీవిభక్తి
కృష్ణుని యందు ఈ జగమంతయు నెలకొని యున్నది-సప్తమీవిభక్తి
ఓ కృష్ణా! నన్ను రక్షింపుము -- సంబోధన ప్రథమావిభక్తి