सामग्री पर जाएँ
सर्वकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 116, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 116

ముకుందమాల 109
స్వామి : నా కంటె గొప్పవారిని ఆశ్రయింపరాదా?
కుల : స్వామీ! నీకంటెను మించినవా డున్నాడనినే నే శాస్త్రము
నందును చదివియుండలేదు. నా బుద్ధి కట్లు తోచలేదు.
22
భక్తాపాయభుజంగ గారుడమణిః త్రైలోక్య రక్షామణిః
గోపీలోచన చాతకాంబుదమణి స్సౌందర్య ముద్రామణిః,
యః కాంతామణి రుక్మిణీ ఘనకుచద్వంద్వైక భూషామణిః
శ్రేయో దేవశిఖామణి ర్దిశతు నో గోపాలచూడామణిః.
భక్త=భక్తులయొక్క, అపాయ=కష్టములనెడి, భుజంగ=సర్పములకు,
గారుడమణిః=శ్రేష్ఠమైన గారుడమంత్రమును, త్రైలోక్య=ముల్లోకముల
యొక్క, రక్షా=కాపాడుటయందు, మణిః=శ్రేష్ఠుడును, గోపీ=గోపికల
యొక్క, లోచన=కన్నులను, చాతక=వానకోయిలలకు, అంబుదమణిః=
కాళమేఘమైనవాడును, సౌందర్యముద్రామణిః=అందమునకు దృఢమైన
ముద్రయైనవాడును, కాంతామణి=స్త్రీలలో నుత్తమురాలైన, రుక్మిణీ=రుక్మి
ణీదేవియొక్క, ఘన=గొప్పవయిన, కుచద్వంద్వ=స్తనములజంటకు, ఏక=
ముఖ్యమయిన, భూషామణిః=శ్రేష్ఠమైన ఆభరణప్రాయమైనవాడును, దేవశి
ఖామణిః=దేవతలకు శిరోభూషణ మైనవాడును, గోపాలచూడామణిః=గొల్ల
లలో శ్రేష్ఠుడును, యః=ఎవడో, సః=ఆ శ్రీ కృష్ణుడు, శ్రేయః=సంపదను,
నః=మాకు, దిశతు=ఇచ్చునుగాక!
భక్తుల యపాయములనెడి పాములకు గరుడమణియు, మూడు
లోకములకును రక్షామణియు, గోపికలయొక్క కన్నులనెడి చాతకము
లకు మేఘమణియు, సౌందర్యమునకు ముద్రామణియు, నారీమణియగు
రుక్మిణీ దేవియొక్క ఘనకుచములకు అలంకారమణియు, దేవశిఖామణియు
నగు గోపాలచూడామణి మాకు శ్రేయస్సు నొసంగుగాక!