मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 115, कुल 167 में से
संदर्भ में पढ़ें108 ముకుందమాల
స్వామి : నే నచ్చట నుండిన వేళ ఆదిశేషుడు సహాయుడై యున్నాడు.
ఈ లోకమునకు వచ్చుటచేత ఆ యాదిశేషుడు లేడు గదా!
ఎట్లు సహాయసంపన్నుడ నగుదును?
కుల : స్వామి! నీవు నీ పేరును మార్చితివి. అందుచేత నీ
శయ్యయు తన పేరును మార్చుకొనెను. నీవు కృష్ణుడవు.
అతడు రాముడు. అందుచేత నీవు రామానుజుడవు. సహా
యసంపన్నుడవే.
స్వామి : అటులైన నీకేమి కావలయును?
స్వామి : జ్ఞాన భక్తి వైరాగ్యములు కావలయును.
స్వామి : ఆచార్యు నాశ్రయింపుము.
కుల : స్వామి! నీవు ఆచార్యుడవు కావా? కాదని చెప్పిన యెడల
ఇతరాచార్యుల నాశ్రయించెదను.
స్వామి : నేను గురువు నగుదునా?
కుల : స్వామి! నీవు జగత్త్రయగురుడవు కదా! బ్రహ్మదేవుని
నాభికమలమునందు గూర్చుండ బెట్టుకొని వేదముల నుప
దేశించలేదా? బదరికాశ్రమమున నరనారాయణరూపుడవై
నారాయణాష్టాక్షరీమంత్రము నుపదేశించ లేదా?
స్వామి : మిగుల స్తుతించుచున్నావు. ఏమి కోరెదవు?
కుల : ఓ పుండరీకాక్షా! నీ విశాలనేత్రములతో జూచిన చాలును.
స్వామి : జ్ఞానభక్త్యాదు లుండినగదా రక్షింప నగును?
కుల : స్వామి! నీవు గోపీజననాథుడవుగదా! గోపికలకు జ్ఞాన
భక్త్యాదులుండెనా? వారు సల్పిన కామభక్తిని గూడ సమ్మ
తించితివి కదా! కనుక నన్ను కాపాడుటకు సంశయ
మేల?