मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 90, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 83
మాధవ = ఓ లక్ష్మీపతి, క్షీణపుణ్యాన్ = పాపముచేసినవారిని, క్షణ
మపి = ఇంచుక సేపైనను, భవతః = నీయొక్క, పద + అబ్జే = కమలముల వంటి
పాదముల యందు, భక్తిహీనాన్ = భక్తి లేనివారిని, మాద్రాక్షం = చూడకుం
దును గాక, శ్రావ్యబంధం = వినదగిన రచనగల, తవ = నీయొక్క, చరితం = కథను;
అపాస్య = విడిచి, అన్యత్ = ఇతరమయిన, ఆఖ్యానజాతం = చరిత్రముల సమూ
హమును, మాశ్రౌషమ్ = వినకుందునుగాక, భువనపతే = లోకనాయకుడవగు
శ్రీకృష్ణమూర్తీ, త్వాం = నిన్ను, చేతసాఽపి = మనస్సుతోనయినను, అపహ్నువా
నాన్ = తిరస్కరించువారిని, మాస్మార్షం = తలంచకుందునుగాక, జన్మజన్మాం
తరేఽపి = ప్రతిజన్మములోను, త్వత్ = నీయొక్క, సపర్యా = సేవయొక్క, వ్యతి
కరరహితః = సంబంధము లేనివాడుగా, మా భూవం = కాకుందునుగాక!
ఓ లోకనాథా! నీయొక్క పాదకమలములయందు క్షణకాలమైనను
భక్తిలేని పాపులను నేను చూడజాలను. చెవి కింపైన మీయొక్క చరిత్ర
మును విడిచి యితరమయిన ప్రబంధములను చెవులార వినను.
ఓ శ్రియఃపతీ! నిన్ను తిరస్కరించువారిని మనస్సుచేత నయిన తలం
చను. జన్మజన్మాంతరములయందును నీ కైంకర్యము కల్గియుందును గాక!
మనస్సు : బుద్ధీంద్రియాదులను వశపఱచుకొనవచ్చును కాని అయో
గ్యులు చేరినయెడల అన్ని ప్రయత్నములును వ్యర్థము లగును.
దీనికి మార్గ మేదో తెలియుకున్నది.
కుల : మనసా! దుర్మార్గుల సహవాసము కలుగకుండుటకై స్వామిని
ప్రార్థించెదను. (కులశేఖరులు మనసునకు ఈ రీతిగ తెల్పి
భగవంతుని ప్రార్థించిరి).
కుల : స్వామీ! అనేక ప్రయత్నములు చేసి మంచిస్థితికి వచ్చి
యుండువాడైనను దుర్మార్గుని వలలో పడినప్పుడు హీనస్థితికి
వచ్చును. అట్టివాని సహవాసమున నెట్టి భక్తికలవాడైనను