मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 77, कुल 167 में से
संदर्भ में पढ़ें70 , ముకుందమాల
కుల : కాపాడును. అయినను అతని యొద్ద కేగునపుడు ఆలస్య
మను దుష్టుని మాత్రము చేర్చుకొని పోకుము. వానిని
త్యజింపుము.
మనస్సు : కామక్రోధాదులు పాపములు మొదలగువానికి భయపడ
వలయును గాని ఆలస్యమునకు భయపడనేల?
కుల : ఆలస్యమును విడిచిన యెడల అన్నియును సమకూ
రును. ఆలస్యమును త్యజించిన తోడనే విషయములను
చక్కగ గ్రహింపవచ్చును. ఆలస్యము వీడెనేని జ్ఞానము
కలుగును. దోషము లన్నియు తామే పాఱిపోవును.
మనస్సు : ఆలస్యమును నెట్టివేసిన యెడల ఆయన పిలుచునా?
కుల : పిలువకేమి? భక్తి సులభుడుగదా!
మనస్సు : అత డెచ్చట నున్నాడో!
కుల : మనసా! ఇతర ప్రభువులను దర్శింపగోరితిమేని వారుండు
చోటికి పోవలసియుండును. ఇతనిని తలచితిమేని
మనయొద్దకే యీతడు వచ్చును. అతని దర్శనమునకు
పోనక్కరలేదు. ధ్యానింపుము.
మనస్సు : మనము పోనియెడల ఆయనయే మన దగ్గరకు రావ
లసియుండును. అందుచేత అతనికి మాత్రము
శ్రమగలుగదా?
కుల : మనసా! ఆయన మన హృదయముననే యున్నాడు.
అతడు నారాయణుడు. చరాచర ప్రపంచమునం దుండు
వాడు. అన్నిటికిని ఆశ్రయము, ఆధారము. అతడు
సర్వాంతర్యామి.
గామావిశ్య చ భూతాని ధారయా మ్యహమోజసా,
పుష్ణామి చౌషధీ స్సర్వా స్సోమో భూత్వా రసాత్మకః.
-- గీత. 15.13