सामग्री पर जाएँ
सर्वकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 148, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 148

ముకుందమాల 141
అనన్త = తుదలేనివాడా, వైకుంఠ = ఓ వైకుంఠుడా, ముకుంద = ఓ
ముకుందుడా, కృష్ణ = శ్రీకృష్ణమూర్తీ, గోవింద = ఓ గోవిందుడా, దామో
దర = ఓ దామోదరుడా, మాధవ = ఓ లక్ష్మీవల్లభా, ఇతి = అని, వక్తుం =
చెప్పుటకు, సమర్థోఽపి = శక్తిగలవాడైనను, కశ్చిత్ = ఒకడైనను, న వక్తి =
చెప్పడు, అహో = అయ్యో, జనానాం = మూఢులకు, వ్యసనాభిముఖ్యం =
దుఃఖము లందలి యుత్సాహము ఎంతటిదో!
కులశేఖరులు : నామోచ్చారణమే అన్నిటికి మూలము.
ప్రశ్న : ఇది సాధారణకార్యమే; సులభముగ చేయవచ్చునే.
కుల : అదియే ఆశ్చర్యము. జనులు వ్యసనపరులై ప్రవర్తించు
చున్నారు. అందుకు భగవన్మాయయే కారణము.
జ్ఞానము లేని మృగాదులు నామోచ్చారణ చేయకున్న
యెడల తప్పులేదు. మనుష్యులకు సామర్థ్యముండియు
చేయకుండుటే ఆశ్చర్యము. ఆయిరములో పెరియా
ళ్వార్లు బిడ్డల కైనను రామ, కృష్ణ యని పేరుపెట్టు
డనిరి. నారాయణు డను పేరుగల తన దాసీపుత్రుని
బిలిచి సద్గతి నొందిన అజామిళుడే ఇందు కుదాహరణము.
ప్రశ్న : భగవన్నామముల నెట్లు చేయవలెను?
కుల : శ్రీనాథ యని పేర్కొన వలెను. శ్రీమహాలక్ష్మిని పురు
షకారముగ నుంచుకొని స్వామి నాశ్రయింప వలెను.
తండ్రి కోపించినను, తల్లి యతని నడ్డగించి కాపాడును.
ప్రాణులచేత నాశ్రయింపబడి స్వామి నాశ్రయించున
నియు, వారి ప్రార్థన విని స్వామికి వినిపించుననియు,
ప్రాణుల కామక్రోధాది దుర్గుణములను బోగొట్టి మోక్ష
యోగ్యులుగ జేయుననియు శ్రీ శబ్దమున కర్ధము.
తల్లి నాశ్రయించినను తండ్రి సామాన్యుడుగ నుండెనేని ప్రయోజనము
లేదు. స్వామి అట్టివాడు కాదు. నారాయణుడు గొప్పవాడు. 'నారాయణ'