सामग्री पर जाएँ
सर्वकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 113, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 113

106 ముకుందమాల
అని భగవద్గీత 15అధ్యా, 16, 17 శ్లోకములలో చెప్పినట్లు నీవు బద్ధ
ముక్తులకు పైవాడవు; పురుషోత్తముడవు; ప్రభుడవు. ఇట్లు బద్ధముక్తులను
పరిపాలించువాడవై యుండి అట్లు పాలింపవేని గోపాలకు డను నీ పేరు
పోవునే.
స్వామి : నేను ఘనులనే కాపాడుదును.
కుల : స్వామీ! నీవు నీ సౌలభ్యగుణముచేత గోవులను గాపాడలేదా?
స్వామి : నేను రక్షింపవలసిన వాడనైనను దయలేకుండు పక్షమున ఏ
దోషమునైనను ఆరోపించి రక్షింపకపోవుదును గదా!
కుల : స్వామీ! నీవు కృపాజలధివి గదా! సముద్రమున జలమునకు
తక్కువ లేనట్లు నీయందు కృపకు తక్కువయుండదు.
స్వామి : కృపగలవాడనైనను నీవు అపరాధము చేసినప్పుడు శిక్షింపనా?
కుల : స్వామి నీవు సింధుకన్యాపతివి గదా! (సముద్రరాజ తన
యకు భర్తవుకదా!) పురుషకారము చేయుటకు మా తల్లి
యుండలేదా?
స్వామి : లక్ష్మీదేవి యుండిన మాత్రమున నేమి? ప్రతివాడును వాని
భార్య మాటను గౌరవించునా?
కుల : స్వామీ! భార్య బీదయంటిదై యుండెనేని భర్త ఆమె మాటను
ఒకవేళ త్రోసిపుచ్చినను పుచ్చును. శ్రీమంతుని పుత్రిక అయ్యె
నేని ఆమె మాట సదా చెల్లుచుండును. నీ భార్యయన్ననో
రత్నాకరుని కూతురు గదా! అందుచేత నామెమాట నీ
చెవి కెక్కగలదు. ద్వయప్రకరణము 13 వాక్యము రీత్యా
ఈమె చేతనులతో మాతృత్వ సంబంధము గలిగి వీరి దుఃఖ
మును చూడజాలక భగవంతునితో పత్నీత్వసంబంధము గలిగి
ఆయనకు అత్యంత ప్రియురాలైయుండుటచేత ఈమె పురు
షకారము చేయును. ఆ పురుషకారమునకు ఏవిధమైన
ప్రతిబంధకమును ఉండదు.